అభిమానులను హెల్ప్ అడిగిన రామ్ చరణ్...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో చరణ్ చెవిటివాడిగానూ, సమంత మూగ అమ్మాయిగానూ నటిస్తున్నారు. సినిమా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుండటంతో సినిమా టైటిల్స్ విషయంలో పలు పేర్లు వినపడ్డాయి. అయితే దర్శకుడు సుకుమార్ ఏ టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు.
తాజాగా ఈ విషయంపై చరణ్ కూడా తన ఫ్యాన్స్‌ను హెల్పి చేయాలని కోరాడు. తాను సుకుమార్‌ను ఓ నెలరోజులుగా టైటిల్ పెట్టమని అడుగుతున్నానని, అయితే సుకుమార్ ఏం చెప్పడం లేదని, కాబట్టి సోషల్ మీడియా ద్వారా సుకుమార్‌పై అభిమానులు ప్రెషర్ పెట్టాలని కోరుకుంటున్నానని, ఈ విషయంలో తనకు అభిమానుల హెల్ప్ కావాలని చరణ్ కోరాడు. మరి సుకుమార్‌ను మెగాభిమానులు ఎలా అడుకుంటారో చూడాలి. లేదా సుకుమార్ ముందుగానే టైటిల్‌ను బయటకు చెప్పేస్తాడేమో కూడా చూడాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com