మళ్లీ 'బ్రూస్ లీ' విషయంలోనే..
Send us your feedback to audioarticles@vaarta.com
'రచ్చ' దగ్గర్నుంచి రామ్ చరణ్ కెరీర్‌ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే.. సినిమా సినిమాకి మధ్య కనీసం ఏడాదిలోపు గ్యాప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం. అది చెర్రీకి మంచి ఫలితాన్నే ఇచ్చింది. 'రచ్చ'కి ముందు మాత్రం సినిమా సినిమాకి ఏడాది పైగానే గ్యాప్ కనిపించింది చరణ్ సినిమాల విషయంలో.
ఇక ఏడాది కంటే తక్కువ గ్యాప్‌లోనే చరణ్ నుంచి సినిమాలు వస్తాయనుకుంటే.. 'గోవిందుడు అందరి వాడేలే' రిలీజైన ఏడాది తరువాత కొత్త చిత్రం 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గోవిందుడు గతేడాది అక్టోబర్ 1న వస్తే.. బ్రూస్‌లీ ఈ అక్టోబర్ 16న వస్తోంది. అంటే మళ్లీ 'బ్రూస్‌లీ' విషయంలోనే ఏడాదికి పైగానే విరామమిచ్చినట్లయ్యింది. 'బ్రూస్‌లీ' తరువాత ఈ తరహాలో గ్యాప్ రాకుండా సురేందర్ రెడ్డి, గౌతమ్ మీనన్ సినిమాలను తెలివిగా లైన్‌లో పెట్టుకున్నాడు చరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments