రామ్ చరణ్ రిలీజ్ చేసిన సుమ 'జయమ్మ పంచాయితీ' ఫస్ట్ లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెరపై కనిపించబోత్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.
జయమ్మ పంచాయితీ అంటూ రాబోతోన్న ఈ సినిమాలో సుమ కనకాల ఎంతో ఇంటెన్సిటితో కనిపిస్తున్నారు. పాత కాలంలో మాదిరి రోలు, రోకలి పట్టుకుని సుమ కనిపిస్తున్నారు. సుమ ఎంతో కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమ రోకలి దెబ్బకు పగళ్లు రావడం కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు.
ఇక ఆమె కొంగును చూస్తే.. గ్రామీణ వాతావరణానికి సంబంధించిన అంశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సుమ ఊరి పెద్దలా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ లుక్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.
వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.
ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ తుది దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతోన్నారు నిర్మాతలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments