బాబాయ్ కోసం ప్ర‌చారం చేస్తా...

  • IndiaGlitz, [Saturday,January 05 2019]

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం తాను ప్ర‌చాచం చేయ‌డానికి కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు రాంచ‌ర‌ణ్ తెలిపారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న రాంచ‌ర‌ణ్ సినిమా 'విన‌య‌విధేయ‌రామ‌' ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాంచ‌ర‌ణ్ మాట్లాడుతూ త‌న బాబాయ్‌కి స‌పోర్ట్ ఇవ్వ‌డానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానంటూ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

'మా మెగా ఫ్యామిలీ మోర‌ల్ స‌పోర్ట్ ఎప్పుడూ బాబాయ్‌కి ఉంటుంది. ఆయ‌న‌కు పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేయ‌డానికి నేను సిద్ధ‌మే. అయితే అందుకు నేను ఫిట్ అని ఆయ‌న భావిస్తే ఆయ‌న నాకు ఫోన్ చేయ‌డానికి ఏమాత్రం ఆలోచించ‌రు. ఆయ‌న కోసం ఏదైనా చేయ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు' తెలిపారు రాంచ‌ర‌ణ్‌. మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో రాంచ‌ర‌ణ్ స‌హ‌కారం కోర‌తాడో లేదో చూడాల్సిందే..