రామ్ చరణ్ రేర్ ఫీట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ కుటుంబానికీ, బెంగుళూరుకు మంచి కనెక్షన్ ఉంది. ఫ్యామిలీతో ఛిల్ అవుట్ కావాలంటే చిరంజీవి వెంటనే ఆలోచించే ప్లేస్ బెంగుళూరు. అక్కడి ఫామ్ హౌస్‌లో వారి కుటుంబం ఎంత సరదాగా ఉంటుందో ఇంతకు ముందు కూడా చాలా ఫొటోల్లో చూశాం. తాజాగా బెంగుళూరుకు.. అదే కన్నడిగులకు, మెగాస్టార్ ఫ్యామిలీకి మరో గొప్ప అనుబంధం ఏర్పడనుంది.
అదీ రామ్‌చరణ్ ద్వారా. ఇంతకీ ఆ విషయం పేరు రంగస్థల. అవును.... రామ్‌చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా కన్నడలో ;రంగస్థల; పేరుతో డబ్బింగ్ అవుతోంది. మన దేశంలో ఏ భాష నుంచి అయినా మరో భాషకు సినిమాలను డబ్బింగ్ చేసుకునే అవకాశం ఉంది. కానీ కన్నడలోకి మాత్రం ఎవరూ డబ్ చేసి రిలీజ్ చేయరు.
అసలు కన్నడిగులు డబ్బింగ్ చిత్రాలను అంగీకరించరు. అలాంటిది ఈ రూల్‌ని బ్రేక్ చేసి తొలిసారి కన్నడలోకి అనువాదమవుతున్న చిత్రం 'రంగస్థలం'. తెలుగులో బంపర్ హిట్ కొట్టిన 'రంగస్థలం' కన్నడ, మలయాళం, తమిళ్లో భారీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ మూడు భాషల్లోనూ విడుదల చేస్తున్నది మైత్రీ మూవీసే కావడం గమనార్హం. చెవిటి వ్యక్తిగా చరణ్, పల్లెటూరి పడుచుగా సమంత, కరుడుగట్టిన విలన్‌గా జగపతిబాబు, హీరో సోదరుడిగా ఆది పినిశెట్టి నటించిన చిత్రమిది. సుకుమార్ దర్శకత్వం, రత్నవేలు కెమెరా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కలిసి మేజిక్ చేసిన చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout