క్రైమ్ థ్రిల్లర్ గా 'రంగస్థలం'?

  • IndiaGlitz, [Thursday,February 22 2018]

సుకుమార్.. త‌ను తీసే సినిమాలనే కాదు, థియేటర్లో కూర్చునే ప్రేక్షకుల బ్రెయిన్‌ను కూడా తన కంట్రోల్‌లోకి తెచ్చుకునే బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన సినిమాలు తెరపై చూస్తున్నంత సేపు.. ప్రతీ సన్నివేశం ఆమోదయోగ్యంగానే అనిపిస్తుంది. బయటికి వచ్చిన తర్వాత కూడా మెదడుకి మేతలా ఉంటాయి ఈ దర్శకుడి కథ, కథనాలు. ప్రస్తుతం రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం' చిత్రం కూడా బ్రెయిన్ గేమ్ లానే ఉంటుందని సమాచారం. ఇంతవరకు ఈ సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అనే అందరికి తెలుసు. దీన్ని నిజం చేస్తూ.. ఇటీవ‌ల‌ విడుదల చేసిన “ఎంత సక్కగున్నావే” లిరికల్ వీడియో కూడా లవ్ స్టొరీనే తలపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ చిత్రం అందరూ అనుకున్నట్టు ఫీల్ గుడ్ లవ్ స్టొరీ మాత్రమే కాద‌ట‌. ప్ర‌ధానంగా ఒక మర్డర్ మిస్టరీని ఛేదించే థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాని సుక్కు తెరకెక్కించారని విశ్వసనీయ సమాచారం. చిత్రంలో రామ్ చరణ్ అన్నయ్య పాత్ర(ఆది)ను ఎవరో చంపేస్తారని.. హంతకుడు ఎవరో కనిపెట్టే దిశగా కథ సాగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ బధిరుడుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సమంత మూగ అమ్మాయిగా నటించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్యా ఉదంతాన్ని చూసిన సమంత.. రామ్ చరణ్‌కు ఆ విష‌యాన్ని ఎలా చెప్పింది అన్నదే కథ అని టాలీవుడ్ టాక్. గతంలో మెమరీ లాస్ ఉన్న హీరో.. మర్డర్ మిస్టరీని ఛేదించడం చూశాం. ఇప్పుడు మూగ, చెవుడు ఉన్నవారు మర్డర్ మిస్టరీని ఛేదించడం చూడబోతున్నామ‌న్న‌మాట‌. ఏదైనా సుక్కు స్టైలే వేరబ్బా అంటున్నారు అభిమానులు.

More News

సమంత పారితోషికం తగ్గించుకుందట

నేర పరిశోధనలో పోలీస్ శాఖకి మీడియా కూడా తోడైతే ఎటువంటి కేసునైనా ఛేదించగలరు.

ఫిబ్రవరి 23 న విడుదలవుతున్న 'హైదరాబాద్ లవ్ స్టోరీ'

తెలుగు సినిమాలో లవ్ స్టోరీలు సర్వసాధారణం కానీ ఈ లవ్ స్టోరీ కి ఓ ప్రత్యేకత ఉంది

హరీష్ శంకర్ దర్శకత్వం లో 'సీటీమార్'

'గబ్బర్ సింగ్ ' తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్హిట్ చిత్రం 'దువ్వాడ జగన్నాథమ్ ' లోని

తేజు చేతికి నాని చిత్రం...?

శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించిన సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఇప్పుడు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తుంది. అందులో భాగంగా నేచుర‌ల్ స్టార్ నాని, కిశోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో ఓ సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మైంది.

ప్రియా వారియ‌ర్‌కు సుప్రీమ్‌లో ఊర‌ట‌...

'ఒరు అదార్ ల‌వ్‌' అనే మ‌ల‌యాళ సినిమాలో న‌టించిన హీరోయిన్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రిటీ అయ్యింది. అయితే ఆమెకు ఎంత ఫేమ్ వ‌చ్చిందో... అదెలా చిక్కులు కూడా వ‌చ్చి ప‌డ్డాయి.