చిరుని క్రాస్ చేసిన చరణ్.. వందకోట్ల క్లబ్లో 'రంగస్థలం'
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సమంత జోడిగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన చిత్రం 'రంగస్థలం'. మార్చి 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
అందులో దాదాపు 65 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్స్... రెండు తెలుగు రాష్ట్రాల నుండి 456 కోట్ల రూపాయల షేర్‌ను.. ఓవర్ సీస్, రెస్టాఫ్ ఇండియా కలుపుకుని 20 కోట్ల షేర్‌ను సాధించిందని ట్రే్డ్ వర్గాల సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్లో చరణ్ సినిమా దూకుడుగా కలెక్షన్స్‌ను రాబడుతుంది. ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్స్‌ను క్రాస్ చేసింది.
దీంతో చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150' ఫుల్ రన్లో 2.46 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌ను రాబట్టుకుని నాలుగోస్థానంలో ఉంటే నిన్నటితో చరణ్ .. ఓవర్ సీస్ కలెక్షన్స్ పరంగా తండ్రి రికార్డును క్రాస్ చేసేశాడు.
ఇప్పుడు మూడో స్థానంలోని శ్రీమంతుడు కలెక్షన్స్ 2.89 మిలియన్ డాలర్స్‌ను క్రాస్ చేసేలా కనపడుతున్నాడని ట్రేడ్ టాక్. ఇదే జోష్‌తో కొనసాగితే రంగస్థలం రెండు రోజుల్లో మూడు మిలియన్ డాలర్స్‌ను వసూలు చేస్తుందంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com