జనవరిలో రానున్న 'రంగస్థలం' ఫస్ట్ లుక్

  • IndiaGlitz, [Wednesday,November 29 2017]

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా రంగస్థలం 1985'. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా న‌టిస్తోంది. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నారు.

గోదావరి తీరంలో.. గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. మరో నాలుగు రోజుల్లో రంగ‌స్థ‌లం టాకీ పార్ట్ పూర్తవుతుందని తెలిసింది. మిగిలి ఉన్న‌ నాలుగు పాటలను డిసెంబర్ లో చిత్రీకరించనున్నారు.

మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారని తెలిసింది.

పూజా హెగ్డే ఓ ప్ర‌త్యేక గీతంలో మెర‌వ‌నున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వేస‌వి కానుక‌గా మార్చి 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.