ఫిబ్రవరి 13న 'రంగస్థలం' తొలి పాట
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న భారీ చిత్రం `రంగస్థలం`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సి.వి.ఎం) నిర్మాతలు ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 30న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, హీరోయిన్ సమంతలకు సంబంధించిన టీజర్స్‌ను విడుదల చేశారు. పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో చిట్టి బాబు గా రామ్‌చరణ్, రామలక్ష్మిగా సమంత లుక్స్‌కు ప్రేక్షకుల నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ ఆల్బమ్‌లో తొలి పాటను వేలంటెన్స్ డే సందర్భంగా ప్రిబ్రవరి 13న విడుదల చేయబోతున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను మార్చి 30న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రామ్ చరణ్, సమంత, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి, సాహిత్యం: చంద్రబోస్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సి.వి.ఎం), దర్శకత్వం: సుకుమార్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com