Ram Charan:భార్య ఉపాసన కాళ్లు నొక్కిన రామ్‌చరణ్.. వీడియో వైరల్..
Send us your feedback to audioarticles@vaarta.com
భీకర శత్రువులను ఒంటిచేత్తో ఓడించిన వీరుడైనా.. రాజ్యాలను పాలించిన రాజు అయినా.. దేశాలను పాలిస్తున్న అధినేతలు అయినా.. కోట్లాది మంది అభిమానులు ఆరాధించే నటుడైనా.. ఎవరైనా సరే భార్యకు సేవలు చేయాల్సిందే. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన సతీమణి ఉపాసన పాదాలకు మసాజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మహిళా అభిమానులు.. చెర్రీ ఆదర్శ భర్త అని, బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయాలని కామెంట్లు పెడుతున్నారు.
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రివెడ్డింగ్ గ్రాండ్‌గా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఆహ్వానం అందడంతో చెర్రీ, ఉపాసన దంపతులు శుక్రవారం ఓ ప్రైవేట్ జెట్‌లో జామ్‌నగర్ బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో ఉపాసన నిద్రపోతుడంగా.. ఆమె పాదాలకు మసాజ్ చేస్తూ ఉన్నాడు. దీనిని చెర్రీ అసిస్టెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు చరణ్ సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.
అంత పెద్ద స్టార్ హీరో అయి ఉంది భార్య పాదాలు పట్టుకోవడం గ్రేట్ అని కొనియాడుతున్నారు. ఎంతటి వారైనా సరే భార్యకు సేవలు చేయాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. కాగా చెర్రీ గతంలోనూ RRR ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు షాపింగ్ వెళితే ఉపాసన బ్యాగులు మోయడం.. ఇంట్లో వంట చేసేటప్పుడు సాయం చేయడం చేస్తూ ఉంటాడు. వీరి అన్యోన్యమైన దాంపత్యానికి ఇలాంటి వీడియోలే నిదర్శమని చెబుతున్నారు. 'ఆయన మీకు గ్లోబల్ స్టారేమో.. నాకు మాత్రం పాద దాసుడే' అని ఉపాసన అనుకుంటున్నట్లుగా ఉందని ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.
ఇక చరణ్ సినిమాల విషయానికొస్తే RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్నాడు. దీంతో తన తర్వాతి చిత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే 80శాతంకు పైగా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
— TeamUpasana (@TeamUpasana) March 1, 2024
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments