వైరల్ పిక్: RRR సెట్లో రాంచరణ్.. పవర్ ఫుల్ లుక్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో లాక్ డౌన్ ముగియడంతో అన్ని చిత్రాలు షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. యావత్ దేశం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ కరోనా కారణంగా దసరాకు వాయిదా పడింది. ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ షూటింగ్ కు ఆటంకం కలిగించింది.
ఇదీ చదవండి: నా గర్ల్ ఫ్రెండ్ మరో వ్యక్తితో.. ఆసక్తి రేపుతున్న 'వద్దురా సోదరా' మోషన్ పోస్టర్!
దీనితో తదుపరి రిలీజ్ డేట్ పై అనిశ్చితి నెలకొని ఉంది. ఈ తరుణంలో అభిమానులకు సంతోషంగా కలిగించేలా రాజమౌలి ఆర్ఆర్ఆర్ షూట్ షురూ చేశారు. అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న రాంచరణ్ షూటింగ్ కోసం రంగంలోకి దిగాడు.
ఫేమస్ హైర్ స్టైలిస్ట్ అలీమ్ కహీమ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ రాంచరణ్ పవర్ ఫుల్ లుక్ లో ఉన్న పిక్ ని పోస్ట్ చేశారు. 'ఈరోజు హైదరాబాద్ లో లాక్ డౌన్ ముగిసింది. సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం అయ్యాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం రాంచరణ్ కు హెయిర్ కట్ తో నా డే ప్రారంభం అయింది. మన అందరి అభిమాన దర్శకులు రాజమౌళి' అని అలీమ్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా రాంచరణ్ తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ సెల్ఫీలో చరణ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. దీనితో ఈ పిక్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com