రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్‌డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
రంగస్థలంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్రలో కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చి అభిమానులనే కాకుండా సగటు ప్రేక్షకులను సైతం అలరించారాయన. ప్రస్తుతం చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ సినిమా 2020లో తెరపైకి రాబోతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తరువాత సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సంస్థలో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు చరణ్. ఈ విషయాన్ని చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి.. తేజ్ ఐ లవ్ యు ఆడియో ఫంక్షన్‌లో స్వయంగా ప్రకటించారు. చిరుతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన రామారావు.. చరణ్‌తోనూ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com