చ‌ర‌ణ్ నెక్స్‌ట్ మూవీ కొత్త ద‌ర్శ‌కుడితోనా?

  • IndiaGlitz, [Saturday,March 07 2020]

కెరీర్ ప్రారంభంలో చిరుత‌, ర‌చ్చ వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసినా.. ‘రంగ‌స్థ‌లం’ వంటి భారీ హిట్ త‌ర్వాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ‘వినయవిధేయరామ’ ప్లాప్‌తో చ‌ర‌ణ్ మ‌రింత అప్ర‌మ‌త్త‌మ‌య్యాడు. డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపుతున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌ల‌సి ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా చేస్తున్న చ‌ర‌ణ్ త‌దుప‌రి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. కానీ తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌ల ఫిల్మ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే.. ప్ర‌దీప్ అనే కొత్త డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ రామ్‌చ‌ర‌ణ్‌కు బాగా న‌చ్చింద‌ట‌. మెగాస్టార్ చిరంజీవి కూడా క‌థ విన్నాడ‌ట‌..ఆయ‌న‌కు బాగా న‌చ్చింద‌ని, చిన్న చిన్న మార్పులు సూచించాడ‌ట‌. దాదాపు ఈ సినిమానే సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మ‌రి చ‌ర‌ణ్ కొర‌టాల‌కు ఓకే అంటాడో లేక డెబ్యూ డైరెక్ట‌ర్‌ని ట్రాక్‌లోకి తెస్తాడో తెలియాలంటే కొన్నిరోజులు ఆగ‌క త‌ప్ప‌దు.

ప్రస్తుతం నటిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్‌’లో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ధారిగా క‌నిపించ‌బోతున్నారు. ఈయ‌న‌కు జోడీగా ఆలియా భ‌ట్ న‌టించ‌నుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌ధారిగా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు.