రామ్ చరణ్ కొత్త ఆలోచన...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `రంగస్థలం 1985` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే కొరటాల శివ భరత్ అనే సినిమాతో బిజీ కాబోతున్నాడు. ఈలోపు చరణ్ ఓ సినిమాను చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాల దర్శకుడు త్రినాథ్ నక్కిన దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడట. దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తాడని సమాచారం. రామ్‌చరణ్‌తో సినిమా ఉంటుందని దిల్‌రాజు చెప్పాడు కానీ, దర్శకుడెవరనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com