చరణ్ కొత్త సినిమా ప్రారంభం..?
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రూస్ లీ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. బ్రూస్ లీ తర్వాత రామ్ చరణ్ తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ లో నటించనున్నారు. ఈ చిత్రం తెలుగు రీమేక్ రైట్స్ ను బ్రూస్ లీ నిర్మాత దానయ్యే తీసుకున్నారు. తని ఒరువన్ చిత్ర దర్శకుడు జయం రాజానే తెలుగు రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ సురేందర్ రెడ్డి ఈ రీమేక్ ని డైరెక్ట్ చేయనున్నారు.
ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య, ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవంబర్ లో ఈ సినిమాని ప్రారంభించి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ సరసన కాజల్ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com