రామ్ చరణ్ న్యూమూవీ టైటిల్...

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ సినిమా త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. విల‌న్ గా అర‌వింద్ స్వామి న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా న‌టించే ఈ మూవీకి ర‌క్ష‌క్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. బ్రూస్ లీ ప్లాప్ అవ్వ‌డంతో రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ లేదా ఇలియానా న‌టించే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ చేసి షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఓరువ‌న్ తెలుగులో ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి మ‌రి.

More News

సంక్రాంతికి వచ్చేస్తానంటున్న శర్వానంద్..

యువ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ ప్రెస్ రాజా.ఈ చిత్రంలో శర్వానంద్ సరసన సురభి హీరోయిన్ గా నటించింది.

బెంగాల్ టైగర్ మూవీ రివ్యూ

రామ్ చరణ్ తో రచ్చ వంటి సక్సెస్ తర్వాత పవన్కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తాడని అంతా ఓకే అయ్యాడని అనుకున్న తరుణంలో, సంపత్ నంది ఉన్నట్లుండి సర్దార్ గబ్బర్ సింగ్ నుండి డైరెక్టర్ గా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

జనానికి నచ్చని కథలతో సినిమా చేస్తానంటున్న రవితేజ...

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు.ప్రపంచ వ్యాప్తంగా బెంగాల్ టైగర్ ఈరోజు రిలీజ్ అయ్యింది.

సూపర్ స్టార్, స్టైలీష్ స్టార్ తో విక్రమ్ కుమార్..

13బి,ఇష్క్ చిత్రాలతో విజయాలు సాధించి మూడు తరాల అక్కినేని హీరోలతో మనం సినిమాని తెరకెక్కించి ఇండస్ట్రీలో అందరి ద్రుష్టి ఆకర్షించిన డైరెక్టర్ విక్రమ్ కుమార్.

శ్రీ శ్రీ గురించి సూపర్ స్టార్ కామెంట్..

సూపర్ స్టార్ క్రిష్ణ,విజయనిర్మల,నరేష్ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీ శ్రీ.ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ సాయిదీప్,బాలు రెడ్డి,షేక్ సిరాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.