చ‌ర‌ణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్

  • IndiaGlitz, [Saturday,December 19 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌ని ఓరువ‌న్ లో విల‌న్ పాత్ర పోషించిన అర‌వింద్ స్వామినే తెలుగు రీమేక్ లో విల‌న్ పాత్ర‌కు ఎంపిక చేసారు. బ్రూస్ లీ ప్లాప్ త‌ర్వాత చ‌ర‌ణ్ ఎలాగైనా స‌రే ఈసారి హిట్ కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో సినిమా చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 16న ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. చ‌ర‌ణ్ స‌ర‌స‌న శ్రుతి హాస‌న్ న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ చేయ‌నున్నారు. మ‌రి...రామ్ చ‌ర‌ణ్ కి బ్రూస్ లీ తో మిస్ అయిన హిట్ త‌ని ఓరువ‌న్ తో అయినా వ‌స్తుందే లేదో చూడాలి.

More News

రంగ‌నాథ్ వంటి ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తిని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం : బాల‌కృష్ణ‌

న‌టులు రంగ‌నాథ్‌గారు ఇలా ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డం అనేది బాధాక‌రం. న‌న్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఆది పుట్టినరోజు 23న 'గ‌రమ్' ఆడియో

లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, మదన్ దర్శకత్వంలో శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'.

బాల‌య్య‌తో ఎన్టీఆర్ గొడ‌వ స‌మ‌సిపోనుందా...

గ‌త కొన్ని బాబాయ్ బాల‌య్య‌, అబ్బాయి ఎన్టీఆర్‌ల మ‌ధ్య సైలెంట్ వార్ న‌డుస్తుంది. ఇది కాద‌న‌లేని విష‌యం.

తమిళ రీమేక్ ప్లాన్ లో నితిన్

తమిళ రీమేక్ ప్లాన్ లో ఉన్న యువ హీరో... ఎవరో కాదు క్యూట్ హీరో నితిన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ అ ఆ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అభిమానులకు పవన్ కానుక....

పవర్ స్టార్ పవన్కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. సినిమాను స్మమ్మర్ లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవర్ ఫేమ్ బాబీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.