చరణ్ న్యూమూవీకి ముహుర్తం ఫిక్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తని ఓరువన్ రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నారు. ఎన్.వి.ప్రసాద్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తని ఓరువన్ లో విలన్ పాత్ర పోషించిన అరవింద్ స్వామి తెలుగు రీమేక్ లో కూడా నటించేందుకు అంగీకరించారు. భజరంగీ భాయిజాన్, ఏక్తా టైగర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన అసీమ్ మిశ్రా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయనున్నారు. ఈ చిత్రానికి వర్క్ చేసే టెక్నీషియన్స్ అంతా కన్ ఫర్మ్ అయ్యారు. త్వరలోనే చరణ్ సరసన నటించే హీరోయిన్ ను ఫైనల్ చేయనున్నారు. ఈ మూవీని జనవరి రెండో వారంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments