చరణ్ కొత్త ఇల్లు ఖరీదెంతో తెలుసా?
- IndiaGlitz, [Monday,February 04 2019]
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ... టాలీవుడ్‌లోనే ఆస్థిపరుడైన హీరో అని ఓ నేషనల్ ఛానెల్ రీసెంట్‌గా తెలియజేసిందట. చెర్రీ ఆస్థుల విలువ 1300 కోట్ల రూపాయలను మించిందని సదరు ఛానెల్ తెలియజేసింది.
ఇందులో ముఖ్యంగా చరణ్ కొత్తగా కట్టుకున్న ఇల్లు గురించి తెలిస్తే షాక్ అవుతారట. జూబ్లీ హిల్స్‌లో చెర్రీ కొత్త ఇల్లు విలువ 38 కోట్ల రూపాయలని సమాచారం. ఇంత ఖరీదైన ఇల్లు ఉన్న సౌతిండియన్ స్టార్ కూడా చెర్రీయేనట.
ఈ స్టార్ హీరో ఇప్పుడు దానయ్య నిర్మాణంలో మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతోన్న భారీ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.