చరణ్ కొత్త నిర్ణయం..
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రూస్ లీ సినిమా విజయం సాధించకపోవడంతో రామ్ చరణ్ లో చాలా మార్పు వచ్చిందట. ముఖ్యంగా పారితోషికం విషయంలో ఇక నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండా...లాభాల్లో షేర్ తీసుకోవాలనుకుంటున్నాడట. నిర్మాణ వ్యయం తగ్గించేందుకే చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. తమిళ చిత్రం తని ఒరువన్ రీమేక్ లో చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత నటిస్తుంది. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించి...జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ లో విజయం సాధించిన తని ఓరువన్ తెలుగులో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందోచూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments