చరణ్ సినిమా అలా ఉండబోతుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్‌కు తగ్గట్టు సినిమాను దర్శకుడు సుకుమార్ డిఫరెంట్‌గా తెరకెక్కిస్తున్నాడు. రామ్‌చరణ్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `రంగస్థలం 1985`. రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి సినిమాలు తీసే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. తన మొదటి సినిమా 'ఆర్య' నుంచి 'నాన్నకు ప్రేమతో..' వరకు తన ప్రతి సినిమా విభిన్నంగా వుండేలా సినిమాలు చేశాడు. కథనం నుంచి హీరో క్యారెక్టరైజేషన్ వరకు ఇప్పటివరకు మనం చూడని కోణాన్ని చూపిస్తాడు. ఇప్పుడు తాజాగా రామ్‌చరణ్ హీరోగా 'రంగస్థలం 1985' అనే చిత్రమైన టైటిల్‌తో మరో కొత్త కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.
పక్కా మాస్, యాక్షన్ చిత్రాలు చేసే రామ్‌చరణ్‌కి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. రామ్‌లక్ష్మణ్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 1985 కాలంలోని పరిస్థితులకు అనుగుణంగానే ఎంతో సహజంగా ఫైట్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న రోప్ షాట్స్, ఒక్క దెబ్బ కొడితే గాల్లోకి ఎగిరి పడడం వంటివి ఈ సినిమాలో వుండవు. 32 సంవత్సరాల క్రితం జరిగే కథ కాబట్టి అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సినిమా తియ్యాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో సుకుమార్ ఎక్కడా రాజీ పడకుండా 1985 నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా 'రంగస్థలం 1985' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో రామ్‌చరణ్ గెటప్ ఎలా వుండబోతోందనే విషయంలో ప్రేక్షకులకు ఒక క్లారిటీ అనేది వచ్చేసింది. కాకపోతే కథ ఎలా వుంటుంది? రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్ ఎలా వుండబోతోంది? అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే అంశం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com