25న అక్కడ రాంచరణ్ సినిమా రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర దక్షిణాది చిత్రాల మార్కెట్‌పై కన్నేసిన తెలుగు హీరోలు అక్కడ కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. మహేశ్, ఎన్టీఆర్, బన్ని, రాంచరణ్ అందరూ ఇదే రూట్‌ను ఫాలో అవుతున్నారు. ఈ సంక్రాంతి రేసులో ఉన్న చిత్రాల్లో రాంచరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా కూడా విడుదలవుతుంది.
సంక్రాంతికి జనవరి 11న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోన్న ఈ సినిమాను మలయాళంలో అనువాదం చేసి జనవరి 25న విడుదల చేయబోతున్నారట. త్వరలోనే మలచాళ టైటిల్‌ను కూడా అనౌన్స్ చేస్తారట. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మించారు. కియరా అద్వాని హీరోయిన్. ప్రశాంత్, స్నేహ, వివేక్ ఒబెరాయ్, ఆర్యన్ రాజేష్ తదితరులు కీలక పాత్రధారులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments