చరణ్ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన ఫోటో...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `రంగస్థలం 1985`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ఫై రూపొందుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో నటి అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.
ఈరోజు అనసూయ ట్విట్టర్లో ఓ ఆసక్తికరమైన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో మెట్టెలు వేసుకున్న ఓ స్త్రీ కాలు కనపడుతుంది. పక్కనే ఓ మట్టి కుండ ఉంది. ఈ ఫోటోతో పాటు `నింద నిజమైతే తప్పు దిద్దుకో..అబద్ధమైతే నవ్వేసి ఊరుకో` అనే క్యాప్షన్ పెట్టారు. మరి ఈ క్యాప్షన్ రంగస్థలంలో అనసూయ పాత్రకు సంబంధించిందా లేదా, వ్యక్తిగత అభిప్రాయామా అని తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ సినిమాను 1985 కాలమానాలు ప్రకారం దర్శకుడు సుకుమార్ తెరకెక్కించాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments