చరణ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రాంచరణ్ రీసెంట్గా ధృవ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాంచరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో సినిమా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా చరణ్ బియర్డ్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.
పాపికొండలు, గోదావరి పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణను ఏకధాటిగా చిత్రీకరించారు. నిన్నటితో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ చిత్రంలో చరణ్ చెవిటివాడిగా నటిస్తుంటే, హీరోయిన్ సమంత మూగ అమ్మాయిగా నటిస్తుంది. జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com