చరణ్ సినిమా బిజినెస్ క్రేజ్...
- IndiaGlitz, [Wednesday,February 21 2018]
స్టార్ హీరోల సినిమాలకు సినిమా నిర్మాణం నుండే మంచి క్రేజ్ ఉంటుంది. సినిమా పూర్తి కాకముందు అన్ని ఏరియాల బిజినెస్‌లు పూర్తవుతుంటాయి. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే... మాస్ ఇమేజ్ ఉన్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
వీరి కాంబినేషన్ అనగానే మార్కెట్‌లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే సినిమా నిర్మాణంలో ఉండగానే ఓ ప్రముఖ సంస్థ ఈ సినిమా హిందీ శాటిలైట్, డిజిటల్ హక్కులను 22 కోట్లకు చేజిక్కింకుందట.
ఈ మధ్య హిందీ ప్రేక్షకుల తెలుగు నుండి హిందీలోకి అనువాదమవుతున్న మాస్ సినిమాలను బాగా ఆదరిస్తున్న నేపథ్యంలో చరణ్ సినిమాకు బిజినెస్ క్రేజ్ అమాంతంగా పెరిగినట్లు కనపడుతుంది.