చరణ్ సినిమా బిజినెస్ క్రేజ్

  • IndiaGlitz, [Friday,July 14 2017]

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రంగస్థలం 1985' చిత్రానికి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చాలా జోరుగా జరుగతోందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల క‌థ‌నం. ఇప్పటికే 51 కోట్ల వరకు బిజినెస్‌ పూర్తి చేసుకుంది. చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ అనగానే ట్రేడ్‌ వర్గాల్లో మంచి క్రేజ్‌ వచ్చింది. చరణ్‌ గత చిత్రం 'ధృవ' బిజినెస్‌ పరంగా, కలెక్షన్ల పరంగా మంచి రికార్డులే సాధించింది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. చరణ్‌ సినిమాల్లోనే 'రంగస్థలం' హయ్యస్ట్‌ బిజినెస్‌ చేస్తోందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా శాటిలైట్‌ హక్కులకు 16 కోట్లు, డిజిటల్‌ రైట్స్‌కి 13 కోట్లు ఇప్పటికే వచ్చాయని, అంతేకాక ఏరియా వైజ్‌ బిజినెస్‌లో కూడా పెద్ద మొత్తంలో వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. సినిమా రిలీజ్‌ నాటికి ఈ బిజినెస్‌ 125 కోట్లకు చేరే అవకాశం వుందట. 'ధృవ' చిత్రం 80 కోట్లు కలెక్ట్‌ చేసిన నేపథ్యంలో 'రంగస్థలం 1985' చిత్రం 100 కోట్లు క్రాస్‌ చేస్తుందని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More News

ఆరు దేశాల్లో మహేష్ మూవీ..

ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాహుబలి2' చిత్రంలో గ్రాఫిక్స్ ఎంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయో తెలిసిందే. భారీ సినిమాలకు మంచి కథ, కథనాలు, మంచి ఆర్టిస్టులు ఎంత అవసరమో గ్రాఫిక్స్ కూడా అంతే అవసరం అన్నట్టుగా మారాయి

కపిల్ దేవ్ జీవిత చరిత్రలో ఎవరు?

ఇండియాకు తొలిసారి వరల్డ్ కప్ తెచ్చి పెట్టిన స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్.

బిగ్ బాస్ లో జబర్ దస్త్ కమెడియన్

టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు బుల్లితెర వైపు అడుగులేస్తున్నారు.

ఉయ్యాలవాడతో ఉపేంద్ర

'ఖైదీ నంబర్ 150' చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఆగష్టులో జీవీ ప్రకాష్ - యశ్వంత్ మూవీస్ 'బ్రూస్ లీ'

మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాష్ కుమార్ నటించిన తమిళ చిత్రం 'బ్రూస్ లీ'