నాన్నమ్మ దగ్గర రెసిపీ నేర్చుకుంటోన్న చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమయ్యారు సినీ సెలబ్రిటీలు. టాలీవుడ్ విషయానికి వస్తే సెలబ్రిటీలందరూ బీ ద రియల్ మేన్ ఛాలెంజ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ విషయానికి వస్తే రాజమౌళి నామినేషన్ మీద ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇంటి పనులు చేయడమే కాకుండా.. భార్య ఉపాసనకు కాఫీ కూడా చేయించి పెట్టాడు. ఇప్పుడు నాన్నమ్మ అంజనాదేవి దగ్గర కొత్త రెసీపీ నేర్చుకుంటున్నాడు. ఇంతకూ చరణ్ నేర్చుకుంటోన్న రెసీపీ ఏంటో తెలుసా? వెన్న చిలకడం. ఒకప్పుడు కవ్వంతో వెన్న తీసేవారు. కానీ ఇప్పుడు ఎలక్రికల్ మెషిన్స్ వచ్చేశాయి. ఆ మెషిన్‌తోనే చరణ్ వెన్న చిలుకుతున్నాడు. ఆ వీడియోను చరణ్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం రామ్‌చరణ్..ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ రామ్‌చరణ్, ఆలియాభట్పైనే చిత్రీకరించాల్సి ఉంది. సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో డి.వి.వి.దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు.
Learning to make fresh butter before buttering them???? #GrandmaRecipes #MomBoss pic.twitter.com/syQS4pOEy9
— Ram Charan (@AlwaysRamCharan) May 1, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments