నాన్న‌మ్మ ద‌గ్గ‌ర రెసిపీ నేర్చుకుంటోన్న చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Friday,May 01 2020]

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు సినీ సెల‌బ్రిటీలు. టాలీవుడ్ విష‌యానికి వ‌స్తే సెల‌బ్రిటీలంద‌రూ బీ ద రియ‌ల్ మేన్ ఛాలెంజ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే రాజ‌మౌళి నామినేష‌న్ మీద ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇంటి ప‌నులు చేయ‌డ‌మే కాకుండా.. భార్య ఉపాస‌న‌కు కాఫీ కూడా చేయించి పెట్టాడు. ఇప్పుడు నాన్న‌మ్మ అంజ‌నాదేవి ద‌గ్గ‌ర కొత్త రెసీపీ నేర్చుకుంటున్నాడు. ఇంత‌కూ చ‌ర‌ణ్ నేర్చుకుంటోన్న రెసీపీ ఏంటో తెలుసా?  వెన్న చిల‌క‌డం. ఒక‌ప్పుడు కవ్వంతో వెన్న తీసేవారు. కానీ ఇప్పుడు ఎల‌క్రిక‌ల్‌ మెషిన్స్ వ‌చ్చేశాయి. ఆ మెషిన్‌తోనే చ‌ర‌ణ్ వెన్న చిలుకుతున్నాడు. ఆ వీడియోను చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

ప్రస్తుతం రామ్‌చ‌ర‌ణ్‌..ఎన్టీఆర్‌తో క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ రామ్‌చ‌ర‌ణ్, ఆలియాభ‌ట్‌పైనే చిత్రీక‌రించాల్సి ఉంది. సినిమాను వ‌చ్చే ఏడాది వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య సినిమాను నిర్మిస్తున్నారు.

More News

లాక్‌‌డౌన్‌లో లిక్కర్‌ అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్‌ రెండు వారాల పాటు అనగా మే-17 వరకు కొనసాగనుంది.

లింగంపల్లి నుంచి వలస కార్మికులతో ఝార్ఖండ్‌‌కు తొలిరైలు!

దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను వారి స్వగృహాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణలోని లింగంపల్లి స్టేషన్ నుంచి ఝార్ఖండ్‌లోని హతియా స్టేషన్‌కి 1,230 మంది

లాక్ డౌన్ 3.0 : మే-17 వరకూ పొడిగింపు

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం తాజాగా మరోసారి పొడిగించింది. ఈ 3.0 లాక్‌డౌన్‌ రెండు

ప్రత్యేక రైళ్లు నడిపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థుల ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు. ఇంటికెళ్లలేక అక్కడే ఉండలేక ఇన్నిరోజులూ

యువ నటుడికి కరోనా.. కాలు తొలగింపు

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఎవర్నీ వదలట్లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలువురు కరోనా బారీన పడి కోలుకుంటుండగా..