చిరు మూవీ సీక్వెల్ లో చ‌ర‌ణ్..!

  • IndiaGlitz, [Monday,September 12 2016]

మెగాస్టార్ చిరంజీవి - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం జ‌గ‌దేక‌వీరుడు - అతిలోక‌సుంద‌రి. ఈ సంచ‌ల‌న చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బ్యానర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఇప్పుడు అశ్వ‌నీద‌త్ ఈ చిత్రానికి సీక్వెల్ తీయాల‌నుకుంటున్నారు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో తీయాల‌నుకుంటున్న ఈ చిత్రం కోసం జ‌గ‌దేవ‌క‌వీరుడు అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ త‌ని ఓరువ‌న్ రీమేక్ ధృవ సినిమాలో న‌టిస్తున్నారు. మ‌రి...చ‌ర‌ణ్ తండ్రి చిరంజీవి కెరీర్ లో మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక‌సుంద‌రి చిత్రం సీక్వెల్ చేయ‌డానికి అంగీక‌రిస్తాడా..? చ‌ర‌ణ్ ఓకే అంటే డైరెక్ట‌ర్ ఎవ‌రు త‌దిత‌ర వివ‌రాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!