అతిథి పాత్రలో రాంచరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట. ఇంతకు ఎవరి సినిమాలో అనుకుంటున్నారా! .. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో. అంటే సైరా నరసింహారెడ్డిలో కాదు. చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో రాంచరణ్ అతిథి పాత్రలో నటిస్తాడనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. కానీ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. వచ్చే ఏడాది సెట్స్‌లోకి వెళ్లబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించనుందని టాక్. మరి దీనిపై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌తో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా నిర్మాణంలో భాగం కానుందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments