రామ్ చరణ్ హోస్ట్‌గా డ్యాన్స్ టాలెంట్ షో.. ప్రత్యేకత ఏంటంటే..
- IndiaGlitz, [Wednesday,October 07 2020]
రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్, ‘బీ పాజిటివ్’ మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్‌గా ఉపాసన ఒక సొంత ఇమేజ్ను సంపాదించుకున్నారు. సోషల్ యాక్టివిటీస్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన తాజాగా దివ్యాంగులైన అమ్మాయిలు, అబ్బాయిల కోసం ఓ స్పెషల్ టాలెంట్ షోను నిర్వహిస్తున్నారు. ‘హీల్ యువర్ లైఫ్ త్రూ డ్యాన్స్’ అనే షో ద్వారా డ్యాన్స్‌లో టాలెంట్ ఉన్న దివ్యాంగులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చెర్రీగా హోస్ట్‌గా వ్యవహరించనుండటం విశేషం. అంతే కాకుండా దిగ్గజ కొరియోగ్రాఫర్లు ఫరాఖాన్, ప్రభుదేవా కూడా ఈ షోలో భాగం కానున్నారు.
ఈ షో గురించి తెలియజేస్తూ ఉపాసన ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో తపస్ అనే దివ్యాంగుడికి సంబంధించిన ఓ స్ఫూర్తివంతమైన కథను వివరించారు. పుట్టుకతోనే డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న హైదరాబాద్‌కు చెందిన తపస్‌లో మానసిక ఎదుగుదల లేదు. 2009లో తపస్ జన్మించాడు. అప్పటి నుంచి కూడా మిగతా పిల్లల్లా చురుకుగా, ఉత్సాహంగా ఉండలేకపోయేవాడు. 6 ఏళ్ల వయసు వరకూ తపస్ యూరిన్, బాత్రూం సంబంధిత ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొన్నాడు. తపస్కి అడ్మిషన్ ఇచ్చేందుకు ఎన్నో స్కూళ్లు నిరాకరించాయి. తోటి పిల్లలెవరూ తపస్‌తో ఆడుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు.
అయితే ఆ తర్వాత తనలో ఉన్న డ్యాన్స్ ట్యాలెంట్‌ను గుర్తించి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు. పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. తపస్ తరహాలోనే దివ్యాంగులైన పిల్లల్లో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అతని డ్యాన్స్ చూసి ఎందరో ఆశ్చర్యపోయారు. ఇలాంటి టాలెంట్ ఉన్న ఎందరో దివ్యాంగులను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ‘హీల్ యువర్ లైఫ్ త్రూ డ్యాన్స్’ షోను నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఈ నెల 15 లోపు రిజిస్టర్ చేయించుకోవాలి.
ఈ షో గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. మ్యూజిక్, డ్యాన్స్ నా అభిమానులతో పాటు అనుకున్న వాళ్లెందరినో కలిసేలా చేసింది. ఇప్పుడు యునిక్ డ్యాన్స్ టాలెంట్ షోని అనౌన్స్ చేస్తున్నాను. టాలెంట్ ఉన్న దివ్యాంగ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ‘urlife.co.in’లో ఎంట్రీలను పొంది మీ వీడియోలను అప్లోడ్ చేయండి కొందరు దివ్యాందగుల వీడియోలను చూశా. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వారు చూపించిన టాలెంట్ అద్భుతం. అవి నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. వారిని చూసి ఎంతో నేర్చుకున్నా. దివ్యాంగ సోదరసోదరీమణులకు అందరూ పాల్గొని ఈ షోను సక్సెస్ చేయాలి’’ అని చరణ్ తెలిపాడు.