రామ్‌చరణ్ పెద్ద మనసు.. ఉక్రెయిన్‌లో తనకు సెక్యూరిటీగార్డ్‌గా వున్న వ్యక్తికి ఆర్ధిక సాయం
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ పెద్ద మనసు చాటుకున్నారు. యుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌లో తన తెలిసిన వ్యక్తికి ఆయన ఆర్ధిక సాయం చేశారు. వివరాల్లోకి వెళితే.. రష్యా దండయాత్ర కారణంగా ఉక్రెయిన్ సర్వస్వం కోల్పోతోంది. బాంబు పేలుళ్లు, ఎటు వైపు నుంచి ఏ క్షిపణి వస్తుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఎక్కడ చూసినా సైనికుల మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలు, కూలిపోయిన భవనాలే కనిపిస్తున్నాయి. ప్రకృతి రమణీయతతో అలరారే ఉక్రెయిన్ ఇప్పుడు స్మశానాన్ని తలపిస్తోంది. మరోవైపు రష్యా దురాక్రమణ నుంచి తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ వాసులు ఆయుధం చేతబూని కదనరంగంలోకి దూకారు. అటు ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి పెద్ద ఎత్తున సాయం అందుతోంది. రెడ్‌క్రాస్ సహా ఇతర స్వచ్ఛంద సంస్థలు శరణార్థులకు సాయం చేస్తున్నాయి.
ఇకపోతే.. ఉక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలు షూటింగ్స్ కు హాట్ స్పాట్‌గా నిలుస్తాయి. ఉక్రెయిన్‌కు భారతీయ చిత్ర పరిశ్రమ తో మంచి అనుబంధం ఉంది. అక్కడి చారిత్రాత్మక, అందమైన ప్రదేశాల్లో షూటింగ్స్ జరుపుకున్న సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ కూడా ఉక్రెయిన్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం ఆ దేశం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆర్ఆర్ఆర్ యూనిట్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. అక్కడి వారు చాలా మంచి వారని, తమను బాగా రిసీవ్ చేసుకున్నారని రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు వీరు ముగ్గురు. ఉక్రెయిన్‌లో తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సహాయం చేశానని రామ్ చరణ్ తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ టైమ్‌లో... అక్కడ తనకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో మాట్లాడానని ఆయన చెప్పారు. వాళ్ళకు కొంత డబ్బులు పంపించానని, ఆ సహాయం సరిపోదని చరణ్ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ప్రజలకు కొత్త విషయం తెలుసుకోవాలనే ఉత్సాహం ఉందని చెప్పారు. 'నాటు నాటు...' సాంగ్‌లో కొందరు ఉక్రెయిన్ డ్యాన్సర్లు పాల్గొన్నారని.. ఆ డ్యాన్స్ స్టైల్ వాళ్ళ డ్యాన్స్ స్టైల్ కాదని.. కానీ, వాళ్ళు చాలా ఫాస్ట్‌గా నేర్చుకున్నారని యంగ్ టైగర్ కొనియాడారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout