యంగ్ డైరెక్ట‌ర్‌కు రామ్‌చ‌ర‌ణ్ గ్రీన్ సిగ్న‌ల్‌...!

  • IndiaGlitz, [Tuesday,December 29 2020]

రాంచరణ్ ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముగింపు దశ‌కు చేరుకుంటోంది. ఈ సినిమా తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేస్తాడనే దానిపై క్లారిటీ లేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చెర్రీ సినిమా ఉంటుందని ఇటీవల వార్తలు వినిపించాయి. అలాగే కొరటాల శివతోనూ చరణ్ సినిమా ఉంటుంద‌ని కూడా న్యూస్ వ‌చ్చింది. అయితే ఈ లిస్టులో ఓ కొత్త దర్శకుడు చేరారు. అతనెవరో కాదు.. గౌతమ్ తిన్ననూరి. సక్సెస్ ఉంటే చాలు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆ దర్శకుడితో సినిమాలు చేయాలనుకుంటారు.

ఇప్పుడు ఆ వరుసలో గౌతమ్ తిన్ననూరి చేరారు. ‘మ‌ళ్ళీరావా’, ‘జెర్సీ’ ,చిత్రాలతో వరుస విజయవంత‌మైన చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ జెర్సీ చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి కావ‌డంతో గౌత‌మ్ తిన్ననూరి చ‌ర‌ణ్ ప్రాజెక్ట్‌పైనే ఫోక‌స్ చేస్తాడ‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మ‌రోవైపు రామ్‌చ‌ర‌ణ్‌కు కోవిడ్ పాజిటివ్ రావ‌డంతో ఆయ‌న మ‌రో రెండు, మూడు వారాలు బ‌య‌ట‌కు రాడు. ఆర్ఆర్ఆర్‌లో ఆయ‌న పార్ట్ చిత్రీక‌ర‌ణ కాస్త ఆల‌స్య‌మ‌య్యేలానే క‌నిపిస్తుంది. కానీ ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి. కాబ‌ట్టి.. రామ్‌చ‌ర‌ణ్ మే త‌ర్వాతే ట్రిపులార్ నుండి ఫ్రీ అవుతాడు. దానికి కొన్ని రోజుల ముందే త‌దుప‌రి సినిమాకుసంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.