ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన చెర్రీ...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రాంచరణ్ డిసెంబర్ 9న థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. కె.టి.ఆర్, గంటాశ్రీనివాసరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ అతిథులుగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలోనే తండ్రి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమాకు సంబంధించిన చిరు కొత్త పోస్టర్‌ను రాంచరణ్ విడుదల చేశారు. ఈ సందర్భంలో అభిమానులకు ఓ విషయంపై కూడా క్లారిటీ కూడా ఇచ్చేశాడు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ధృవ సినిమా థియేటర్స్‌లో తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న ప్రెస్టిజియస్ 150వ చిత్రం `ఖైదీ నంబర్ 150` సినిమా టీజర్‌ను ప్రదర్శిస్తామని తెలిపారు.
చిరంజీవి, వినాయక్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఖైదీ నంబర్ 150 వ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com