బోయపాటి సినిమాకు రెడీ అవుతున్న చరణ్

  • IndiaGlitz, [Friday,April 13 2018]

'రంగస్థలం' ఇచ్చిన విజయంతో.. ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చరణ్. ఈ రోజు (శుక్ర‌వారం) జరగబోయే విజయోత్సవ వేడుకలలో కూడా చరణ్ పాల్గోనున్నారు. ఈ వేడుకల తర్వాత చరణ్ ఫ్రీ కానుండడంతో.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేయబోయే తన తదుపరి చిత్రంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. చరణ్ లేని సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. కాగా.. రెండో షెడ్యూల్‌ను ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తారనీ.. చరణ్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని సమాచారం. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న‌ ఈ సినిమాలో కియారా అద్వాని కథానాయికగా నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.

బోయపాటి సినిమా అంటేనే యాక్షన్ సీన్స్‌కి పెట్టింది పేరు. అందుకే పవర్ ఫుల్ విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ని రంగంలోకి దింపారు ఈ యాక్షన్ చిత్రాల‌ డైరెక్టర్. ఓ పక్క తన మార్కు యాక్షన్‌తో తెరపై సందడి చేస్తూనే.. మరో పక్క ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు బోయపాటి.  దేవిశ్రీ ప్ర‌సాద్‌ స్వరాలను సమకూరుస్తున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.

More News

'గ్లామ‌ర్ గ‌ర్ల్స్' ప్రారంభం

విక్ట‌రీ మూవీస్ ప‌తాకంపై గుల్ మ‌హ్మ‌ద్, అక్బ‌ర్, స‌లీమ్,  జి. శంక‌ర్ గౌడ్ తెలుగు, హీందీ భాష‌ల్లో  

ఏప్రిల్ 14న 'మహానటి' టీజర్ మరియు కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ విడుదల

టాలీవుడ్‌లో తెర‌కెక్కుతున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'మ‌హాన‌టి'.  వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి.

శ్రీరెడ్డి పై 'మా' నిషేధం ఎత్తివేత‌... లైంగిక వేధింపుల‌పై క్యాష్ క‌మిటీ!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఫిలిం ఛాంబ‌ర్, డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్, `మా`

విష్ణుకి ఈ సారి కూడా క‌లిసొస్తుందా?

క‌థానాయ‌కుడిగా మంచు విష్ణు కెరీర్ మొద‌లై 15 ఏళ్ళు పూర్త‌వుతోంది.

నెల‌కో హ్యాట్రిక్ డైరెక్ట‌ర్‌..

తొలి చిత్రంతో సినీ పరిశ్రమలో విజయం అందుకోవడం దర్శకులకి ఎంత ముఖ్యమో..