మహేశ్ బాటలో చెర్రీ..
Send us your feedback to audioarticles@vaarta.com
బాబాయ్ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అంటే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ఎంతో ఇష్టం. ఆయన మాటకు రామ్‌చరణ్ బాగా విలువనిస్తుంటాడు. ఇప్పుడు తాను బాబాయ్ మాటను వింటానని చెబుతున్నాడు రామ్‌చరణ్. వివరాల్లోకెళ్తే.. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను కారణంగా 165 గ్రామాల్లోని ప్రజలు జీవన వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. భారీ ఆస్థినష్టం జరిగింది.
ఈ ప్రాంతంలో పర్యటన చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ...`కొన్ని కార్పొరేట్ కంపెనీలు, రామ్‌చరణ్‌తో మాట్లాడి కొన్ని గ్రామాలను దత్తత తీసుకోమని చెబుతాను` అన్నారు. `బాబాయ్ గ్రామాలను దత్తత తీసుకోమని కార్పొరేట్ కంపెనీలతో పాటు నన్నుకూడా అడుగుతానని చెప్పారని తెలిసింది. తప్పకుండా ఆయన మాట పాటిస్తా. అందులో భాగంగా నేను, నా టీమ్ దీనిపై కాస్త అన్వేషణ జరిపి ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటే బావుంటుందో ఆలోచించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానన్నారు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments