చరణ్ ఫోకస్ అలాంటి టైటిలేపైనేనట
Send us your feedback to audioarticles@vaarta.com
రామ్‌చరణ్ ఇప్పటివరకు 9 చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు. 10వ చిత్రంగా తమిళ బ్లాక్‌బస్టర్ 'తని ఒరువన్'ని రీమేక్ చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇంకా ఈ సినిమాకి టైటిల్ నిర్ణయించలేదు. అయితే ఫిల్మ్‌నగర్‌లో ఈ విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
అదేమిటంటే.. ఈ సినిమాకి చరణ్‌కి బాగా కలిసొచ్చిన 'మగధీర' తరహాలో నాలుగక్షరాల టైటిల్‌ని నిర్ణయించే అవకాశముందని. విశేషమేమిటంటే.. చరణ్ నటించిన తొమ్మిది చిత్రాల్లో ఆరు చిత్రాలు మూడక్షరాల చిత్రాలే. వీటిలో 'చిరుత', 'నాయక్', 'ఎవడు' చిత్రాలు కలిసొచ్చాయి. 'ఆరెంజ్', 'తుఫాన్', 'బ్రూస్లీ' డిజాస్టర్ అయ్యాయి. దీంతో మూడక్షరాల టైటిల్స్.. అయితే హిట్స్ లేదంటే డిజాస్టర్స్‌గా ఉండడంతో.. చరణ్ కొత్త చిత్రానికి 'మగధీర' తరహాలో నాలుగక్షరాల టైటిల్‌ని ఎంచుకునే దిశగా ఉన్నాడని వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే .. టైటిల్ ఎనౌన్స్ అయ్యే వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com