చరణ్ భాడీ ఫిట్‌నెస్ వెనుక సీక్రెట్ ఇదే...
Send us your feedback to audioarticles@vaarta.com
'వినయవిధేయరామ' చిత్రంలో ఆరు పలకల దేహంతో చరణ్ చొక్కా విప్పి విలన్స్ భరతం పడుతుంటే ఆడియెన్స్ ఆనందంగా విజిల్స్ వేశారు. అయితే ఆ లుక్ కోసం చరణ్ ఎంతగానో కష్టపడ్డాడు. రాకేష్ ఉదియార్ శిక్షణలో కసరత్తులు చేసిన రాంచరణ్ ఆహారం విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ విషయాన్ని ఆయన సతీమణి ఉపాసన తెలియజేశారు.
ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఆహారాన్ని తీసుకున్నాడట రాంచరణ్. ఉదయంపూట మూడు తెల్లగుడ్డు సొనలు, రెండు గుడ్లుతో పాటు 3/4 కప్పు ఓట్స్, ఆల్‌మండ్ పాలు తీసుకునేవాడు.
11.30 గంటలకు వెజిటెబుల్ సూప్ ... మధ్యాహ్యనం 01.30 గంటలకు 200 గ్రాముల చికెన్, బ్రౌన్ రైస్, 1/2 కప్పు వెబుటబుల్ కర్రీ.. 4 గంటలకు 250 గ్రామలు గ్రిల్డ్‌ఫిష్ కర్రీ, 200 గ్రాముల స్వీట్ పోటాటో, అరకప్పుడు ఉడికించిన కాయగూరలు.. సాయంత్రం 6 గంటలకు పెద్ద కప్పు గ్రీన్ సలాడ్, పావుకప్పు అవకాడో ఫ్రూట్‌ను తీసుకునేవాడట.
చెర్రీ. మధ్యలో ఆకలేస్తే బాదం వంటి నట్స్‌ను ఆహారంగా తీసుకునేవాడట. అలాగే ఈ క్రమంలో చరణ్ కాఫీ, టీ సహా పాలతో తయారైన పదార్థాలను , రెడ్ మీట్, మాసం, షుగర్ ఫ్రూట్స్ వంటి పదార్థాలను తీసుకోలేదట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments