‘RRR’పై ఫస్ట్ టైమ్ మాట్లాడిన చెర్రీ.. ఆసక్తికర వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా RRRను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ చిన్న పాటి లుక్ కానీ.. కనీసం మీడియా మీట్ నిర్వహించి చిత్రబృందం ఏనాడు స్పందించలేదు.
ఫస్ట్ టైమ్ స్పందన!
అయితే.. ఫస్ట్ టైమ్ సినిమా గురించి మాట్లాడిన చెర్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘RRR సినిమా 65 శాతం పూర్తైంది. ఈ ఏడాది జూలై 30న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నేను ఎంతాగానో వేచి చూస్తున్నాను. ఈ సినిమా మెగాభిమానులను, సినీ ప్రియులు అందర్నీ అలరిస్తుంది’ అని చెర్రీ చెప్పుకొచ్చాడు. కాగా.. సోమవారం నాడు విజయవాడ బందరులో హ్యాపీ మొబైల్స్ స్టోర్‌ను రామ్ చరణ్ ప్రారంభించారు. హ్యాపీ మొబైల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందని.. విజయవాడకు ఎప్పుడొచ్చినా చాలా ఆనందంగా ఫీలవుతాన చెర్రీ చెప్పుకొచ్చాడు.
‘మా’ వివాదంపై ఏమన్నాడంటే..!
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదం అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే తన పదవికి యాంగ్రీస్టార్ రాజశేఖర్ రాజీనామా చేయడం.. ఆదివారం నాడు ‘మా’ ఆమోదించడం జరిగింది. ఈ వ్యవహారంపై చెర్రీ మాట్లాడుతూ..‘సినీ రంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారని.. ఆ వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారన్నాడు.
మంచి పరిణామమే..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి వెళ్లడం మంచి పరిణామమని చెర్రీ తెలిపాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments