క్లైమాక్స్ దిశగా రామ్ చరణ్ చిత్రం
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్, అనన్య, వివేక్ ఒబెరాయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శుక్రవారం మొదలైన తాజా షెడ్యూల్ మూడు వారాల పాటు కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌లోనే క్లైమాక్స్‌కు సంబంధించిన సీన్స్ తీయబోతున్నారని సమాచారం. ఈ పతాక సన్నివేశాల్లో ముఖ్య తారాగణం అంతా పాల్గొంటుందని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com