సిక్స్ ప్యాక్‌లో రామ్‌చరణ్ ఫైట్ సీక్వెన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
రంగస్థలం ఘనవిజయం మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా డీవీవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర సన్నిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా సిక్స్ ప్యాక్‌లో రామ్ చరణ్‌పై ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. రెండు నెలల పాటు సల్మాన్ ఖాన్ పర్సనల్ ట్రైనర్ రాకేష్ ఉడియార్ నేతృత్వంలో చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకుని మరీ ఈ సిక్స్ ప్యాక్ బాడీని బిల్డప్ చేసుకున్నారని.. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా చరణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments