ఆ ఇద్దరు హీరోలును చూసి జెలసీగా ఫీలవుతా - చరణ్..!
- IndiaGlitz, [Tuesday,December 20 2016]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇండస్ట్రీలోని హీరోలతో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వేరే హీరోల సినిమాలు సక్సెస్ సాధిస్తే ఫోన్ చేసి అభినందిస్తుంటాడు. మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రానా, అఖిల్...తదితర హీరోలతో చరణ్ కు మంచి అనుబంధం ఉంది. అయితే...ఇద్దరు హీరోలను చూస్తే మాత్రం చరణ్ జెలసీగా ఫీలవుతాడట. ఆ ఇద్దరు హీరోలు ఎవరనుకుంటున్నారా...?
యువ హీరోలు నాని, శర్వానంద్. ఈ విషయాన్ని రామ్ చరణే స్వయంగా ధృవ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూలో చెప్పాడు. నాని, శర్వానంద్ కథలను ఎంచుకునే విధానం చూసి జెలసీగా ఫీలవుతుంటాను. నేను కూడా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉండే స్టోరీస్ చేయాలి అనుకుంటున్నాను అని తెలియచేసారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..!