రామ్ చరణ్ కి అన్నయ్య గా..

  • IndiaGlitz, [Saturday,January 20 2018]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని ఇందులో కథానాయికగా న‌టిస్తుండ‌గా... బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. హీరోలను చాలా ప్రత్యేకంగా చూపించే బోయపాటి ఈ చిత్రంలో రామ్ చరణ్‌ని ఎలా చూపించబోతున్నాడోనని మెగాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాగే బోయ‌పాటి సినిమాల్లో విల‌న్ పాత్ర‌లు కూడా ప్ర‌త్యేకంగా ఉంటాయి. ఇప్ప‌టికే వివేక్‌ ఒబెరాయ్ లాంటి న‌టుడిని విలన్‌గా ఎంపిక చేసుకోవ‌డంతో.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చెప్పకనే చెప్పారు దర్శకుడు. ఇదిలా ఉంటే.. దొంగ దొంగ', జీన్స్', 'జోడి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన తమిళ హీరో ప్రశాంత్.. ఈ మూవీలో రామ్ చరణ్‌కి అన్నయ్య పాత్ర పోషిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ పాత్ర‌, చ‌ర‌ణ్‌కి వ‌దిన‌గా ఉండే స్నేహ పాత్ర సినిమాలో కీల‌కంగా ఉంటాయ‌ని తెలిసింది. ద‌స‌రాకి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

మహేష్ కి స్టోరీ లైన్ చెప్పిన సంచలన దర్శకుడు

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీతో పాటు..ఇతర పరిశ్రమల దృష్టిని కూడా తన వైపు తిప్పుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.

అంతరిక్ష నేపథ్యం..రూ.25 కోట్లు

‘ఘాజీ’సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న నవతరం దర్శకుడు సంకల్ప్ రెడ్డి.

ఆ వార్త‌ల‌ను ఖండించిన నాని

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంతో మొద‌లైన నాని విజ‌య‌యాత్ర ఎంసీఏ వ‌ర‌కు స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నాని రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేస్తున్నారు. ఒక పాత్ర కృష్ణ కాగా.. మ‌రో పాత్ర అర్జున‌. ఈ రెండు పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్స్‌ని సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. వ

విజయకృష్ణ పేరుతో ట్రస్ట్ ఆరంభించి అవసరార్ధులను ఆదుకొంటాను - సీనియర్ నరేష్

సీనియర్ నరేష్ పుట్టిన రోజు వేడుకలు శనివారం హైదరాబాద్ లోని నానాక్ రామ గూడలోని కృష్ణ నివాసంలో అభిమానులు మరియు 'మా' సభ్యుల నడుమ ఘనంగా జరిగాయి.

'ఆచారి అమెరికా యాత్ర' ఆడియో మరియు ట్రైలర్ విడుదల

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కానున్నది.