నూర్ కుటుంబానికి చెర్రీ 10 లక్షల ఆర్థిక సాయం.. భరోసా
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాహీరోలను.. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణంగా అభిమానించే హైదరాబాద్‌కు చెందిన వీరాభిమాని నూర్ మహ్మద్ డిసెంబర్-8న మృతి చెందిన విషయం తెలిసిందే. సిటీ చిరంజీవి యువత అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. వీరాభిమాని చనిపోయాడని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు మెగా హీరోలు చలించిపోయారు. వెంటనే నూర్ నివాసానికి వెళ్లిన మెగా హీరోలు... ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి.. నూర్ కుటుంబ సభ్యులను ఓదార్చి మీకు అన్ని విధాలా అండగా ఉంటామని అభయమిచ్చిన సంగతి తెలిసిందే.
మాట నిలబెట్టుకున్నాడు!
ఈ సందర్భంగా.. అప్పట్లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ షూటింగ్లో బిజిబిజీగా ఉండటంతో హైదరాబాద్‌కు రాలేకపోయారు. ఇవాళ నూర్ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించుకున్న చెర్రీ.. పది లక్షల రూపాయిల చెక్‌ను ఆర్థిక సాయంగా అందజేశారు. చెక్ తీసుకున్న అనంతరం నూర్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాసేపు నూర్ కుటుంబ సభ్యులతో చెర్రీ ముచ్చటించాడు. సుమారు 45 నిమిషాల పాటు చెర్రీ ఇంట్లోనే వారు గడిపారు. కాగా.. నూర్ మరణాంతరం ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల సాయం చేస్తానని చెర్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ హైదరాబాద్ వచ్చిన చెర్రీ ఆర్థిక సాయం చేశాడు.
ఉద్యోగం ఇప్పిస్తా.. పెళ్లికి వస్తా!
ఈ సందర్భంగా వారితో పలు విషయాలు పంచుకున్న చెర్రీ.. నూర్‌ను తిరిగి తీసుకొనిరాలేని కానీ.. మీ ఇంట్లో పెద్ద కొడుకులా అన్ని విధాలా అండగా హామీ ఇచ్చాడు. అదే విధంగా నూర్ కుమారుడికి మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తానని.. అమ్మాయిల పెళ్లిళ్లకు స్వయంగా వస్తానని చెర్రీ భరోసా ఇచ్చారు.
గతంలో చెర్రీ ప్రకటన!
‘మా కుటుంబంలో ఎవరి పుట్టినరోజైన రక్తదాన శిబిరాలతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన నూర్ అహ్మద్ సేవలు వెలకట్టలేం. ఆయనలేని లోటు తీరనిది. గతంలో ఒకసారి ఆయన హాస్పిటల్లో ఉన్నపుడు నేను స్వయంగా వెళ్లి పరామర్శించాను. నూర్ మరణ వార్త మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. మెగా బ్లడ్ బ్రదర్ నూర్ అహ్మద్ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరకుంటున్నాను’ అని ప్రకటనలో రామ్ చరణ్ ఒకింత భావోద్వేగానికి లోనయ్యాడు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com