వ‌రుస‌గా అలాంటి పాత్ర‌ల‌తోనే రామ్ చ‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Saturday,March 31 2018]

సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ సంద‌డి చేసిన చిత్రం రంగ‌స్థ‌లం. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా.. రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో ప్ర‌త్యేక‌మైన చిత్రంగా నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఆది పినిశెట్టికి త‌మ్ముడి పాత్ర‌లో క‌నిపించారు చ‌ర‌ణ్‌. అంతేగాకుండా... బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లోనూ ఈ మెగాహీరో త‌మ్ముడి పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు. ఇందులో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్ అన్నల పాత్ర‌ల్లో న‌టిస్తుంటే.. రామ్ చ‌ర‌ణ్ త‌మ్ముడిగా క‌నిపించ‌నున్నారు.

ఈ రెండు చిత్రాల‌తో పాటు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించ‌నున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీలోనూ చ‌ర‌ణ్ త‌మ్ముడు పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇందులో అన్న‌య్య పాత్ర‌లో ప‌ల‌క‌రించ‌నుండ‌గా.. త‌మ్ముడు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపించ‌నున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

మొత్త‌మ్మీద‌.. రామ్ చ‌ర‌ణ్ వ‌రుస‌గా మూడు చిత్రాల కోసం త‌మ్ముడి పాత్ర‌ల్లో క‌నిపించ‌డం యాదృచ్ఛికమైనా విశేషంగానే చెప్పుకోవ‌చ్చు.