చరణ్.. ఆ ఇద్దరితో మూడోసారి?

  • IndiaGlitz, [Saturday,November 25 2017]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రంగ‌స్థ‌లం 1985తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వేస‌వి కానుక‌గా మార్చి 29న విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో రామ్‌చ‌ర‌ణ్ చేయ‌బోయే చిత్రం నిన్న లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంకి సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే.. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఎంపికైంద‌ని.. అలాగే సంగీత ద‌ర్శ‌కుడిగా థ‌మ‌న్ క‌న్‌ఫ‌ర్మ్ అయ్యాడ‌ని. అదే గ‌నుక నిజ‌మైతే.. ఈ ఇద్ద‌రూ కూడా రామ్‌చ‌ర‌ణ్ తో చేసే మూడో సినిమా అవుతుంది ఇది. ఇప్ప‌టికే ర‌కుల్ కాంబినేష‌న్‌లో బ్రూస్‌లీ, ధృవ చిత్రాల‌ను చేశాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇక థ‌మ‌న్ విష‌యానికి వ‌స్తే.. నాయ‌క్‌, బ్రూస్‌లీ చేశాడు.

సో.. ఈ ఇద్ద‌రూ గ‌నుక ఓకే అయితే.. రామ్‌చ‌ర‌ణ్‌తో మూడోసారి సినిమా చేస్తున్న‌ట్టే. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల కానుంది.

More News

అజ్ఞాతవాసిలోనూ ఆమె ఉందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది అత్తారింటికి దారేది. కుటుంబ కథా చిత్రంగా నిరూపొందినఈ సినిమా.. ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.

చరణ్ మూడోసారి ఒప్పుకుంటాడా?

మెగాపవర్ స్టార్ రామ్చరణ్ తనతో మూడోసారి నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్కు అవకాశం ఇస్తాడా?..ఏమో చెప్పలేం అంటున్నారు టాలీవుడ్ జనాలు. వివరాల్లోకెళ్తే..రామ్చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

మహేష్ గుర్తుకొచ్చాడట..

నటి, నిర్మాత, దర్శకురాలిగా రాణిస్తున్న మహేష్ అక్కయ్య మంజుల ఇప్పుడు సిటీ బ్యాక్ డ్రాప్ లో ఓ లవ్ స్టోరిని తెరకెక్కిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.

బ‌రిలో డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కులు

ఇష్క్‌, మ‌నం, 24 చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్‌. ప్ర‌స్తుతం ఆయ‌న అక్కినేని అఖిల్‌తో హ‌లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

బాల‌కృష్ణ డేట్‌కే వ‌స్తున్న‌ సూర్య‌?

2018 సంక్రాంతి తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదానికి చిరునామాలా మార‌నుంది. ఎందుకంటే.. అటుఇటుగా ఏడు సినిమాలు సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి మ‌రి.