చరణ్.. ఆ ఇద్దరితో మూడోసారి?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం 1985తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని వేసవి కానుకగా మార్చి 29న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో రామ్‌చరణ్ చేయబోయే చిత్రం నిన్న లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంకి సంబంధించి ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే.. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా ఎంపికైందని.. అలాగే సంగీత దర్శకుడిగా థమన్ కన్‌ఫర్మ్ అయ్యాడని. అదే గనుక నిజమైతే.. ఈ ఇద్దరూ కూడా రామ్‌చరణ్ తో చేసే మూడో సినిమా అవుతుంది ఇది. ఇప్పటికే రకుల్ కాంబినేషన్‌లో బ్రూస్‌లీ, ధృవ చిత్రాలను చేశాడు రామ్ చరణ్. ఇక థమన్ విషయానికి వస్తే.. నాయక్, బ్రూస్‌లీ చేశాడు.
సో.. ఈ ఇద్దరూ గనుక ఓకే అయితే.. రామ్‌చరణ్‌తో మూడోసారి సినిమా చేస్తున్నట్టే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com