అల్లు అరవింద్ కి హ్యాండ్ ఇచ్చిన చరణ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం ఖైదీ నెం 150 ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే...మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించాలి అనుకున్నారు. అయితే...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నాన్న 150వ చిత్రాన్ని నేనే నిర్మిస్తాను అని చెప్పడంతో అల్లు అరవింద్ ఓకే అన్నారు.
ఇక చిరంజీవి 151వ చిత్రం మాత్రం నేనే నిర్మిస్తాను అని అల్లు అరవింద్ గతంలో ప్రకటించారు. దీంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి 151వ చిత్రం ఉంటుంది. దీనికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారు అంటూ ప్రచారం జరిగింది. రామ్ చరణ్ మాత్రం 151వ చిత్రాన్ని కూడా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నేనే నిర్మిస్తాను. డైరెక్టర్ ఎవరనేది మాత్రం త్వరలో తెలియచేస్తాను అని చెప్పారు. మరి...151వ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్న అల్లు అరవింద్ ఇప్పుడు ఏమంటారో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments