మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ధృవ పాటలు మార్కెట్లోకి విడుదల
Wednesday, November 9, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న స్టయిలిష్ ఎంటర్‌టైనర్ ధృవ. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మరో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.
హిప్ హాప్ ఆది సంగీతం అందించిన ఈ సినిమా పాటలు నేరుగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలై ట్రెండీ మ్యూజిక్‌తో ఉన్న ధృవ పాటలకు ఆడియెన్స్ నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది. పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా పై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. అన్నీ కార్యక్రమాలతో సినిమాను డిసెంబర్‌లో విడుదల చేస్తున్నారు.
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్- పి.యస్.వినోద్, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments