హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రామ్ చరణ్ ధ్రువ
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ధ్రువ. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.ఇటీవలే కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ చిత్ర విశేషాలను తెలియచేస్తూ....జులై నెలాఖరువరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. ఆతర్వాత అగష్టు లో సాంగ్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రంలో రామ్ చరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చరణ్ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. విభిన్నమైన కథతో , ఆశక్తికరమైన కథంశంతో రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది.
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఫెర్ఫార్మెన్స్, రకూల్ ప్రీత్ సింగ్ అందచందాలు చిత్రానికి హైలెట్ గా నిలిస్తే, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలుస్తాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి చరణ్ ని చాలా ఢిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ని మరోసారి చూడబోతున్నాం. అరవింద్ స్వామి క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి మరో ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. యాక్షన్ పార్ట్ ని సురేందర్ రెడ్డి చాలా గ్రాండియర్ గా షూట్ చేస్తున్నాడు. ఆగష్టు 15న ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తాం. త్వరలో టీజర్ ని అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేస్తాం అని అన్నారు.
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నవదీప్, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ - పి.యస్.వినోద్, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్, ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments